SRH ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. KKRతో జరుగుతున్న మ్యాచ్లో సిక్సర్ల సెంచరీ పూర్తి చేసుకుని, మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. అభిషేక్ SRH తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతడికి ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే SRH తరఫున 143 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో క్లాసెన్ (89), కేన్ విలియమ్సన్ (64), హెడ్ (50) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.