VKB: కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి జీవితంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు.