NGKL: అచ్చంపేటలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ వీల్ చైర్లు పంపిణీ చేశారు. ఎంఆర్ జీవన్ సదన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరారు.