NLG: అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కొండ సోమయ్య సతీమణి పుల్లమ్మ గురువారం మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న BRS రాష్ట్ర నాయకుడు సిద్ధార్థ వారి స్వగ్రామానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎంపీటీసీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.