TG: రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల కోసం భూసేకరణ జరిపి సహకరించాలని MP రఘునందన్ రావు ప్రభుత్వాన్ని కోరారు. శంషాబాద్ విమానాశ్రయం రద్దీ నేపథ్యంలో మామునూరు, ఆదిలాబాద్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఏపీలో 8 విమానాశ్రయాలు ఉన్నాయని, తెలంగాణలోనూ మరిన్ని అందుబాటులోకి రావాలన్నారు. శంషాబాద్లో రెండో టెర్మినల్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.