PLD: సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయలో 2-10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు పాఠశాలలో ఆఫ్లైన్ దరఖాస్తులు పొందవచ్చు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దరఖాస్తులు అందజేస్తారని తిరిగి 08 తేదీ సాయంత్రం నాలుగు లోపు సమర్పించాలని ప్రిన్సిపల్ సురేష్ పేర్కొన్నారు.