TG: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్ట్ ఆమోదానికి ఎలాంటి కాలపరిమితి లేదని తెలిపింది. మదింపు, వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. 2017 మెట్రో పాలసీ ప్రకారం అప్రైజల్ కొనసాగుతోందని పేర్కొంది. ఫేజ్-1తో ఫేజ్-2 అనుసంధానం సాధ్యాసాధ్యాలపై కమిటీని కేంద్రం నామినేట్ చేసిందని వెల్లడించింది.