KMM: బోనకల్ మండలం ముష్టికుంట్లలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభను సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సభకు అడిషనల్ కలెక్టర్ శ్రీజ హాజరై ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆమె సమీక్షించారు. ఎంపీడీవో, తహసీల్దార్, ఉప సర్పంచ్ సీతయ్య, అధికారులు పాల్గొన్నారు.