HNK: గ్రామసభల ద్వారా గ్రామంలోని సమస్యలను గుర్తించి, పరిష్కరించడం జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ప్రజాసమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అక్కంపేట గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు.