ATP: గుత్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు.స్టేషన్ రికార్డులను పరిశీలించి, నవోదయం 2.0 అమలుపై సమీక్షించారు. కేసులు పెండింగ్లో పెట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాటు సారా తయారీ, రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి అడ్డుకోవాలని ఆయన స్పష్టం చేశారు.