WGL: ఖానాపురం (M)లోని రామలింగయ్యపల్లెకు చెందిన భూక్య సేవికకు చదువు కొనసాగించేందుకు పరుచూరి రత్నాకర్ రావు రూ. 50,000 ఆర్థిక సహాయం అందించారు. కొలకత్తా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆగిపోనున్న నేపథ్యంలో ఈ సహాయం అందించారు. విద్యార్థిని ఉన్నతంగా చదువుకుని భవిష్యత్తులో ప్రజలకు మంచి వైద్యం అందించాలని సూచించారు.