KMM: బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మధిర పట్టణంలో ఆదివారం ఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు నిర్వహించారు. మండల శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల కోసం జగ్జీవన్ రావు చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.