SRCL: వీర్నపల్లి మండలంలోని కంచర్ల గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ సామల్ల దేవరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. జగ్జీవన్ గొప్ప సామాజిక సంస్కర్తగా దేశానికి సేవ చేశారని తెలియజేశారు.