RR: మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 119వ జయంతిని షాద్నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళిత బహుజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప దళిత నేత బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.