WGL: జిల్లా కేంద్రంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో MBBS, BDS ట్యూషన్ ఫీజులను నిబంధనల మేరకే వసూలు చేయాలని ఆదేశించారు. 4, 5 ఏళ్ల ఫీజును ఐదు వాయిదాలలో తీసుకోవాలని స్పష్టం చేశారు. ఐదేళ్ల ఫీజును ఒకేసారి చెల్లించాలని విద్యార్థులను వేధిస్తే సదరు కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.