MNCL: బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీలో BJP నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయన పార్టీ జెండాను ఎగరవేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు.