IPL 2026లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సమీర్ రిజ్వి మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. గతేడాదిలో చాలా మార్పులు వచ్చాయని.. తన ఆటతీరు మెరుగుపర్చుకునేందుకు చాలా కష్టపడినట్లు తెలిపాడు. తన కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు వస్తోందని చెప్పాడు. నాణ్యమైన ఆటతీరు ప్రదర్శిస్తేనే తమ కుర్రాళ్లకు అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చాడు.