RR: సిద్ధార్థ హాస్పిటల్ ఆధ్వర్యంలో శంకర్ పల్లి మండలం చందిప్ప మరకత శివాలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుజిత సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో పలువురు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.