HNK: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా ఐనావోలు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో మహిళా సంఘ సభ్యులు బెల్ట్ షాపుల తొలగింపుపై గళమెత్తారు. గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్ షాపుల వల్ల యువత మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకుని బెల్ట్ షాపులను నిర్మూలించాలని సర్పంచిని కోరినట్లు మహిళలు తెలిపారు.