BDK: పాల్వంచ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై వదిలేసిన డాంబర్ కుప్ప వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతుందని వాహనదారులు అవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మరమ్మతుల అనంతరం ఆ వ్యర్థాలను తొలగించకపోవడంతో మలుపు వద్ద ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు.