KMR: భిక్కనూర్ SI ఆంజనేయులు కుమారులు కుశాల్ మనోహర్ యాదవ్, కార్తీక్ మనోహర్ యాదవ్ భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి‘ఎలైట్ వరల్డ్ రికార్డ్’ సాధించారు. ‘గీతా పరివార్’ నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతుల ద్వారా శిక్షణ పొంది గోల్డ్ మెడల్ సాధించారు. బెంగళూరులో నిర్వహించిన జ్ఞానస్మృతి కార్యక్రమంలో ప్రతిభ చాటి సర్టిఫికేట్ను పొందారు. ఈ సందర్భంగా SP అభినందలు తెలిపారు.