NLG: దేవరకొండలో రన్ ఫర్ జీసస్ ర్యాలీని శనివారం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి దూతగా ఏసు మార్గంలో శాంతి స్థాపనే లక్ష్యంగా పయనిస్తున్న క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాస్టర్స్, కన్వీనర్స్ పాల్గొన్నారు.