TG: హుజూరాబాద్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రతిపాదించిన డంపింగ్ యార్డు నిర్మాణ స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. డంపింగ్ యార్డు నిర్మాణానికి బీజేపీ వ్యతిరేకం కాదని.. అయితే దాన్ని నివాస ప్రాంతాలకు, ప్రజలకు దూరంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.