బాలీవుడ్ నటి సన్నీ లియోన్ హాలీవుడ్ ఆఫర్ దక్కించుకుంది. ‘ది జెయింట్’ అనే భారీ అమెరికన్ వెబ్ సిరీస్లో ఆమె కీలక పాత్ర పోషించనుంది. ఇది తన కెరీర్లోనే అత్యంత విభిన్నమైన ప్రాజెక్ట్ అని సన్నీ సంతోషం వ్యక్తం చేసింది. మొత్తం 6 ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ 30 నిమిషాల నిడివి ఉంటుంది. కెవిన్ బి ప్లాత్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.