AKP: ప్రజలు ఆన్లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర హెచ్చరించారు. ఎలమంచిలి మండలం పెదపల్లిలో ఆన్లైన్ బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. బెట్టింగ్‌కు పాల్పడితే అప్పుల పాలు అవడం ఖాయం అన్నారు. అలాగే గంజాయి డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని సూచించారు. దొంగతనాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.