MLG: మహబూబాబాద్‌లో సారాయి తయారీకి బెల్లం అమ్మిన వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. గరిపెల్లి నాగేశ్వరరావు మళ్లీ అదే తప్పు చేయడంతో కేసు నమోదు చేశారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 50 వేలు జరిమానా విధించారు. జరిమానా మొత్తాన్ని అతడు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.