ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలో ఇళ్లు లేని పేదలకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని సీపీఎం నాయకుడు సయ్యద్ హనీఫ్ డిమాండ్ చేశారు. ఆర్కేపల్లి, ఉప్పలపాడు, డీటి పల్లి తదితర గ్రామాల పేదలు గురువారం తహసీల్దార్ కేవీ. ప్రసాద్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అర్హుల గుర్తింపు చేసి స్థలాలు కేటాయిస్తామని తహసీల్దార్ తెలిపారు.