TG: హ్యామ్ రోడ్ల టెండర్లలో అవినీతి ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. తాను నిప్పులాంటి వ్యక్తినని.. తనపై అవినీతి మరకలు, ఆరోపణలు లేవన్నారు. రోడ్ల గురించి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికేం తెలుసు అని విమర్శించారు. ప్రశాంత్ రెడ్డికి యజ్ఞాలు, యాగాల గురించి మాత్రమే తెలుసునని ఎద్దేవా చేశారు. హ్యామ్ రోడ్లలో ఎలాంటి అవినీతి లేదని తేల్చి చెప్పారు.