PLD: రొంపిచర్ల మండలం బుచ్చి పాపన్నపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నరసరావుపేట ఎమ్మెల్యే డా. అరవింద బాబు పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పిల్లలతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి చదువు, ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాల సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.