సత్యసాయి: పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ కొండంపల్లిలో మంత్రి సవిత ఇవాళ పర్యటించారు. ప్రసన్న కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ మార్ట్, ఫర్టిలైజర్ షాపులను ఆమె శుక్రవారం ప్రారంభించారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం సంతోషకరమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.