కోనసీమ: రానున్న గోదావరి పుష్కరాలకు పుష్కర ఘాట్లను, ఆలయాలను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ర్యాలి గ్రామంలో జగన్మోహిని కేశవ స్వామివారి ఆలయంలో ఆలయ నిధులు రూ. 28 లక్షలతో చేపట్టిన రాజగోపుర నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు.