PDPL: గోదావరిఖని పట్టణం అశోక్ నగర్లో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు అతడిని 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సదరువ్యక్తి గురువారం మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యక్తి మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. మృతుడి వివరాలు తెలిస్తే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు.