SS: పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలో రూ. 5 కోట్లతో త్వరలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి సవితమ్మ తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. నాయకులు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు.