కేరళం CM పినరయ్ విజయన్‌కు తెలంగాణ CM రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణకు వచ్చి ‘ఆరు గ్యారెంటీలు’ ఎలా అమలవుతున్నాయో స్వయంగా చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తున్నాయో వివరించారు. రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతుల లోన్లు మాఫీ చేసినట్లు సీఎం తెలిపారు.