VSP: జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన 9 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశామని విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. తాజాగా ఈ ముఠాకు సంబంధించి కడప జిల్లాకు చెందిన నగేషయ్యను అరెస్టు చేశామన్నారు. విశాఖలోని ఫుడ్ కార్పొరేషన్ ఇండియా విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి రూ.83 లక్షల వరకు దోచుకున్నారన్నారు.