NLG: నకిరేకల్‌లో బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వీధిలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు శరత్ చంద్రపై కుక్కలు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎగబడ్డాయి. దీంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని నానమ్మ, తాత వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.