NGKL: తాడూర్ మండలం యాదిరెడ్డి పల్లి వద్ద బైక్ అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లిన ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తాడూర్ గ్రామానికి చెందిన పాలబూత్ శంకర్ గురువారం రాత్రి భళాన్ పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరై చెన్నోళ్ల కాలనీ మీదుగా తాడూర్ వెళ్తుండగా బైక్ అదుపు తప్పి మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.