JN: తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్వీట్ చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం పోరాడి అమరత్వం పొందిన వీరుడు దొడ్డి కొమురయ్య అని, వారి పోరాట చరిత్రను భావితరాలకు చాటి చెప్పేలా.. దొడ్డి కొమరయ్య జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహించామన్నారు.