PLD: సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అమరావతి అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గుంటూరులోని తన నివాసంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల సమయంలో అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన జగన్, ఆ తరువాత మాట తప్పి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారని ఆరోపించారు.