KMM: ఖమ్మం జిల్లావ్యాప్తంగా గురువారం జరిగిన పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో చైతన్య జైనీ తెలిపారు. మొత్తం 16,975 మంది విద్యార్థులకు గానూ 16,954 మంది హాజరయ్యారని, 21 మంది గైర్హాజరైనట్లు ఆమె తెలిపారు. 2 కేంద్రాలను, డిస్ట్రిక్ట్ లెవల్ అబ్జర్వర్లు 6 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 36 కేంద్రాలను తనిఖీ చేశామని అన్నారు.