TPT: ఎమ్మెల్యే పులివర్తి వెంకట ప్రసాద్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 9న పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన యువతకు అవకాశం కల్పిస్తూ, 12 కంపెనీలలో 860కిపైగా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 8లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.