NLR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న సిబ్బందికి ఆసుపత్రి డైరెక్టర్ టీడీపీ సీనియర్ నేత దొడ్ల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు గెలుపొందారు. గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఆసుపత్రికి వచ్చే నిరుపేదల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు.