GNTR: అమరావతికి చట్టబద్ధత లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాజధానికి పట్టిన గ్రహణం వీడిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఆనంద సమయంలో అమరావతికి దీపహారతులు ఇవ్వాలని కోరుతూ ప్రజలకు భారీగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇవాళ రాత్రి 7 గంటలకు ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీపాలతో సెల్ఫీలు దిగి, సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరుతున్నారు.