ELR: కుటుంబ సమస్యల నేపథ్యంలో మనస్తాపం చెందిన సస్పెక్ట్ షీటర్ జోగా రవి కిరణ్ శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రూరల్ మండలం వట్లూరు నెహ్రూ కాలనీకి చెందిన రవికిరణ్ గతంలో దొంగతనం కేసులలో ముద్దాయిగా ఉండడంతో అతనిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ప్రస్తుతం అతను ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు.