AP: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2026 ఈనెల 25న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఈనెల 9వ తేదీ వరకే ఉంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా, మొదట ఈనెల 4వ తేదీతో గడువు ముగియాల్సి ఉండగా, అధికారులు 9వ తేదీ వరకు గడువు పొడిగించారు.