BHPL: రేగొండ మండలం రేపాక గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా తండ్రిని అతని కొడుకులు దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఒంటరిగా నివసిస్తున్న చేరాలు మరో మహిళతో ఉండటాన్ని గమనించిన కుమారులు వారిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆయన ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందగా, మహిళ పరకాల ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.