BDK: చండ్రుగొండ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ గుంతల వాహనదారులకు ఇబ్బంది పడుతున్నట్లు ఆదివారం తెలిపారు. రహదారిపై పెచ్చులు ఊడి ప్రమాదకరంగా మారడంతో, ఆ గుంతను తప్పించబోయి ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొనే పరిస్థితి నెలకొంది. కొన్ని నెలలుగా సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.