NZB: వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలోని జంబీ హనుమాన్, అభయాంజనేయ స్వామి వారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ పూజారులు స్వామి వారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలను అందజేశారు