విశాఖ గంగవరం ప్రభుత్వ పాఠశాలను గురువారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సరిగా లేకపోతే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ భోజనం తనిఖీ చేయాలని ఆదేశించారు.