MHBD: కురవి మండలం తిర్మలాపురం గ్రామ సర్పంచ్ కనకటి అచ్చమ్మను ఎస్పీ డా.శబరీష్ సన్మానించారు. గ్రామంలో ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలోని ప్రతిఒక్క గ్రామం ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. DSP తిరుపతిరావు, రూరల్ సీఐ అంజలి, కురవి ఎస్సై గండ్రాతి సతీష్, తదితరులున్నారు.